: మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న భారత సైన్యం
పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. ఓ వైపు చైనాతో మరో వైపు పాక్‌తో సరిహద్దుల వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోతోంది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, మాంజికోట్ సెక్టార్లలో పాక్ సైన్యం భీకరంగా కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పుల దృష్ట్యా 85 పాఠశాలలను మూసివేశారు. స్థానికులను భద్రతాదళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఇటీవలే పాకిస్థాన్‌కు అమెరికా నుంచి నిధులు ఆగిపోవడం, పాక్‌ను అమెరికా ఉగ్ర దేశంగా గుర్తించడం వంటి కారణాలతో పాక్ కు గట్టి దెబ్బ తగిలింది. మరోవైపు అమెరికాతో భారత్ సత్సంబంధాలు పెంచుకుంటుండడంతో పాక్ కు మింగుడు పడడం లేదు. దీంతో పాక్ సైన్యం మరోసారి సరిహద్దు వద్ద రెచ్చిపోతోంది.