: రాష్ట్రపతి ఎన్నిక: ఏపీ, అరుణాచల్, అసొం, బీహార్ కౌంటింగ్ పూర్తి... ఎవరికి ఎన్ని ఓట్లంటే!


ఈ ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటులో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగా, ఆల్ఫాబిటికల్ ఆర్డర్ లో రాష్ట్రాల బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్ రాష్ట్రాల బాక్సుల్లోని ఓట్లను లెక్కించారు. వీటిల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు 60,683 ఓట్లు రాగా, ఆయనకు పోటీగా యూపీఏ తరఫున నిలబడ్డ మీరా కుమార్ కు 22,941 ఓట్లు లభించాయి. ఇప్పుడు చత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఫలితం వెలువడనుండగా, రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News