: 5.60 కోట్ల లంచం తీసుకున్న బీజేపీ నేత.. భగ్గుమంటున్న విపక్షాలు
ఓ వ్యాపారవేత్త నుంచి కేరళ బీజేపీ నేత అక్షరాలా రూ. 5.60 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారం కేరళలో దుమారం రేపుతోంది. మెడికల్ కాలేజీ కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి ఇప్పించేందుకు బీజేపీ కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ ఆర్ఎస్ వినోద్ వర్కల లంచం తీసుకున్నారు. స్వయంగా బీజేపీ దర్యాప్తు బృందం చేసిన విచారణలో ఈ నిజం తేలింది. అయితే, ఈ నివేదిక మీడియాకు లీక్ కావడంతో, రచ్చ మొదలైంది. అవినీతి రహిత పాలనను అందిస్తామంటున్న ప్రధాని మోదీ మాటల్లో నిజం ఎక్కడుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని విమర్శిస్తున్నాయి. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తుతామని విపక్ష నేతలు చెబుతున్నారు.