: పూరీ జగన్నాథ్ 50 వెంట్రుకలు, వేళ్ల గోళ్లు, రక్తం ఎఫ్ఎస్ఎల్ కు
నిన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు విచారిస్తున్న వేళ, ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు సేకరించిన నమూనాలు ఎఫ్ఎస్ఎల్ కు చేరాయి. ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ రఫీ మాట్లాడుతూ, పూరీ జగన్నాథ్ కు చెందిన 50 తల వెంట్రుకలు, కాళ్లు, చేతి వేళ్ల గోరు నమూనాలను తాము సేకరించామని, వీటితో పాటు 5 మిల్లీ లీటర్ల రక్తాన్ని ఆయన అనుమతితోనే తీసుకున్నామని వెల్లడించారు. ఈ శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపామని రఫీ తెలిపారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారో లేదోనన్న విషయం పరీక్షల నివేదిక తరువాత వెలుగులోకి వస్తుందని అన్నారు.