: భర్త గురకను పాప్యులర్ పాటతో రీమిక్స్ చేసిన భార్య.... వీడియో చూడండి
నాలుగు సంవత్సరాలుగా తన భర్త గురకను వీడియోలో రికార్డు చేస్తున్న భార్య, తన మేనల్లుడి సహాయంతో ఆ వీడియోలను పాప్యులర్ పాటగా మలిచింది. ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందిన `డెస్పాచిటో` అనే స్పానిష్ పాటను, తన భర్త గురక వీడియోలతో కలిపి రీమిక్స్ చేయించి, వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. ఇక అంతే! మిగతా పని ఇంటర్నెట్ లోకం చూసుకుంది. `ఐడియా అద్భుతం`, `వీడియో సూపర్` అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు కూడా చూడండి మరి!