: వీళ్లిద్దరి పెళ్లి తర్వాతే నా పెళ్లి అని చెప్పిన హీరో రానా!


టాలీవుడ్ హీరో రానా బాలీవుడ్ లో కూడా బాగా పాప్యులర్. 'బాహుబలి' కంటే ముందే బాలీవుడ్ లో పలు సినిమాల్లో రానా నటించాడు. ఇక టాలీవుడ్ లో రానాకు ఉన్న క్రేజ్ గురించి చెప్పుకోనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రానా ఒకడు. హీరో రామ్ చరణ్, రానాలు క్లాస్ మేట్స్ కూడా. టాలీవుడ్ లోని యంగ్ హీరోలు అందరితో రానాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇండస్ట్రీలోని హీరోలలో ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా రానా మాత్రం ఇంకా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.

 ఇదే విషయంపై ఈ మధ్య ఓ ఛాట్ షోలో రానాను అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రానా చాలా ఇంటరెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన పెళ్లి ప్రభాస్, నితిన్ ల తర్వాతే ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం తన వయసు 33 సంవత్సరాలే అని... తన కంటే పెధ్దవాళ్లు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపాడు. తన కుటుంబసభ్యులు కూడా తన వివాహం గురించి ఇంకా ఆలోచించడం లేదని... అందుకే, తనకు తొందరేమీ లేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News