: ఎంవీ శ్రీధర్ కు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
బీసీసీఐ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ కు బోర్డు నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ నోటీసులను జారీ చేశారు. హైదరాబాదులో నిర్మించిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ. 87.91 లక్షల మేర అక్రమాలు జరిగాయంటూ 2014లో శ్రీధర్ తో పాటు అప్పట్లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలను చేపట్టిన సమయంలో అందజేసిన పత్రంలో శ్రీధర్ పొందుపరచలేదు. బీసీసీఐలో పారదర్శకత కోసం క్రికెట్ పాలకమండలి ప్రవేశపెట్టిన పత్రంలో సదరు విషయాన్ని శ్రీధర్ వెల్లడించాల్సి ఉంది. ఆయన ఈ విషయం గురించి పేర్కొనకపోవడంతో తాజాగా ఆయనకు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది.