: యుద్ధం సీన్ షూట్ చేస్తుంటే, నుదుటిని చీల్చిన కత్తి... కంగనాకు 15 కుట్లు... ప్రస్తుతం ఐసీయూలో చికిత్స!


హైదరాబాద్ లో 'మణికర్ణిక: ది క్వీన్ జాన్సీ' చిత్రం షూటింగ్ లో హీరోయిన్ కంగనా రనౌత్ కు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై 'మిడ్ డే డాట్ కామ్' అందించిన వివరాల ప్రకారం, సినిమా షూటింగ్ లో భాగంగా నటుడు నిహార్ పాండ్యాతో కంగన కత్తి యుద్ధం చేయాల్సి వుంది. పలు మార్లు ప్రాక్టీస్ చేసిన అనంతరం, నిజమైన కత్తులతో వీరిద్దరూ యుద్ధానికి సిద్ధపడగా, తల కిందకు వంచాల్సిన సమయంలో కంగన రియాక్షన్ సరిగ్గా లేకపోవడంతో, నిహార్ దూసిన కత్తి, ఆమె నుదుటిని చీల్చింది.

దాంతో రెండు కనుబొమ్మల మధ్య నుంచి ముక్కు మీదుగా తీవ్ర గాయం అయింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, 15 కుట్లు వేసిన వైద్యులు, ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కత్తి గాయం పుర్రె ఎముకకు అతి దగ్గరగా వెళ్లిందని, ఇంకొన్ని మిల్లీమీటర్లు లోపలికి దిగితే, ఆమె ప్రాణాలు మిగిలుండేవి కావని వైద్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ, కోలుకుని డిశ్చార్జ్ కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఘటన తరువాత నిహార్ ఎంతో బాధపడ్డాడని, ఆమెకు క్షమాపణలు చెప్పగా, కంగన క్షమించేసిందని నిర్మాత కమల్ జైన్ తెలిపారు.

  • Loading...

More Telugu News