: నా మనసు దోచుకున్న యువతికి శుభాకాంక్షలు: మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ భార్య ప్రణతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన సతీమణి జన్మదినాన్ని మనోజ్ తన మిత్రులతో కలసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నా హృదయాన్ని దొంగిలించిన యువతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తుది శ్వాస వరకు, ఆ తర్వాత కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా", అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. జన్మదిన వేడుక సందర్భంగా తీసుకున్న ఫొటోను కూడా ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు.