: 'స్పైడర్' కోసం మహేశ్ అదిరిపోయే ప్లాన్ చేశాడు!
మహేశ్ తన సినిమాల విషయంలో ఎంతో ప్లానింగ్ తో ఉంటాడు. ఈసారి పబ్లిసిటీ విషయంలోను ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 'స్పైడర్' సినిమా పబ్లిసిటీకి సంబంధించి తెలుగులో మహేశ్ పెద్దగా కేర్ తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ వుంది.
ఇక తమిళ .. హిందీ భాషల్లో మాత్రం 'స్పైడర్ 'కి పబ్లిసిటీ అవసరమే. అందువలన ఈ సినిమాకి తమిళంలో తగిన ప్రచారం కల్పించడానికి గాను తమిళ మీడియా నుంచి ఓ నలుగురును .. అలాగే హిందీలో ఈ సినిమా పబ్లిసిటీ వ్యవహారాలు చూసుకోవడానికి గాను బాలీవుడ్ మీడియా నుంచి ఓ అయిదుగురును మహేశ్ ఏర్పాటు చేసుకున్నాడట. ఇందుకుగాను వాళ్లకి మహేశ్ ముట్టజెప్పేది భారీ మొత్తమేనని చెప్పుకుంటున్నారు.