: పూరీ జగన్నాథ్ కుమారుడికి కితాబు.. టాలీవుడ్ టాప్ హీరోతో పోల్చిన ఎక్సైజ్ సిబ్బంది!


డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను నిన్న సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరీతో పాటు ఆయన కుమారుడు ఆకాశ్, తమ్ముడు సాయిరాం శంకర్ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం విచారణ కోసం జగన్ ను లోపలకు తీసుకెళ్లారు. వీరిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆకాశ్ తో పలువురు అధికారులు, సిబ్బంది సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఓ మహిళా ఉద్యోగి ఆకాష్ కు ఓ ప్రశంసను ఇచ్చారు. "అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నావ్... హైటు, కలర్ అంతా మహేషే" అంటూ ఆమె కితాబిచ్చారు. సెల్ఫీలు దిగిన తర్వాత ఆకాష్, సాయిరాం శంకర్ లు సిట్ గది ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

  • Loading...

More Telugu News