: పాక్ ఉగ్ర దేశమే.. ట్రంప్ సర్కారు సంచలన నిర్ణయం!


ఇప్పటికే, ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా... ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టింది ట్రంప్ సర్కార్. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ను కూడా చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జైషే మహ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా విహరిస్తూ, నిధులను సేకరిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాయని అమెరికా నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ట్రాన్స్ సహారా, సోమాలియా, ఆఫ్ఘనిస్థాన్, సులవేసీ సీస్ లిట్టోరల్, దక్షిణ ఫిలిప్పైన్స్, ఇరాక్, లెబనానా, ఈజిప్ట్, యెమన్, లిబియా, వెనెజువెలా, కొలంబియాల సరసన పాకిస్థాన్ ను కూడా చేర్చింది. దీంతో, ప్రపంచ దేశాల దృష్టిలో ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న దేశంగా పాకిస్థాన్ అపప్రథను మూటగట్టుకున్నట్టైంది.

  • Loading...

More Telugu News