: తెలంగాణ డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు... వారిని విచారిస్తారో లేదో చూస్తాం: దిగ్విజయ్ ట్వీట్ కలకలం


తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మత్తుమందుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ, దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కామ్ జరిగింది. ఇందులోని కొందరు ప్రముఖులకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో స్నేహం ఉంది. వారి ప్రమేయమూ ఇందులో ఉంది. ఇక వారిని ప్రాసిక్యూట్ చేస్తారో లేక వదిలివేస్తారో వేచి చూడాలి. చూద్దాం" అని ఈ ఉదయం ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ కాగా, దీనిపై టీఆర్ఎస్ నేతలు ఇంకా స్పందించాల్సి వుంది.

  • Loading...

More Telugu News