: కోతి చేష్టలతో గుంటూరు జిల్లాలో ఆగిన పలు రైళ్లు!


ఓ మర్కటం చేసిన పిచ్చి చేష్టలతో గుంటూరు జిల్లాలో రైల్వే శాఖ అధికారులు పరుగులు పెట్టగా, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం రైల్వే గేటు వద్ద ఓ కోతి విద్యుత్ స్తంభం ఎక్కి గంతులు వేయడంతో, ఓ తీగ తెగి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నడికుడి - విజయవాడ లైన్ లో విజయవాడకు ముందు వచ్చే కృష్టా కెనాల్ జంక్షన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఫ్యూజ్ పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు గేటు వద్ద కరెంటు తీగలు తెగాయని తెలుసుకుని, అక్కడికి వచ్చి మరమ్మతులు నిర్వహించారు. ఈ లోగా కేరళ ఎక్స్ ప్రెస్ ను పెదవడ్లపూడిలో, బిట్రగుంట ప్యాసింజర్ రైలును దుగ్గిరాలలో నిలిపివేశారు. మిగతా రైళ్లను ఎక్కడివక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తయిన తరువాత రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో ఆ కోతి కరెంట్ షాక్ కు మరణించింది.

  • Loading...

More Telugu News