: కడప జిల్లా కాజీపేటలో బయటపడిన మూడో శతాబ్దం నాటి అతిపెద్ద బుద్ధ పాద శిల్పం
చరిత్రకారులు ఇది వరకు ఎన్నడూ చూడని అరుదైన బుద్ధపాదం ఒకటి వెలుగు చూసింది. మూడో శతాబ్దానికి (ఇక్ష్వాకుల కాలం) చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పాన్ని కడప జిల్లా కాజీపేట మండలంలోని వెంకట్రామపురంలో అధికారులు కనుగొన్నారు. గ్రామంలోని గంగానమ్మ ఆలయం వెనక ఉన్న కాలువ గట్టుపై దీనిని గుర్తించినట్టు కల్చరల్ సెంటరాఫ్ అమరావతి, విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం తెలిపారు. ఈ శిల్పం మూడు అడుగుల పొడవు, వెడల్పుతో మూడు అంగుళాల మందంతో ఉందని వివరించారు. నాపరాయిపై చెక్కిన ఈ శిల్పాన్ని బుద్ధపాదంగా గుర్తించినట్టు చెప్పారు.