: ఏపీలో ఇంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంపు!


ఏపీలో ఇళ్లు, అపార్ట్ మెంట్స్ కొన్న వారికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పెంచిన ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి. పెంచిన ఛార్జీల వివరాలు.. ఆర్సీసీ డాబా రేటు చదరపు అడుగుకు రూ.890 నుంచి రూ.980కు, రేకుల ఇల్లు చదరపు అడుగు రూ.440 నుంచి రూ.530కు, పూరిల్లు చదరపు అడుగు రూ.100 నుంచి రూ.150కు, అపార్ట్ మెంట్ రిజిస్ట్రేషన్ చార్జీ చదరపు అడుగు రూ.1060కి పెంచారు. 

  • Loading...

More Telugu News