: ముగిసిన విచారణ... పూరీ జగన్నాథ్ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో
టాలీవుడ్‌లో అలజడి రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఈ రోజు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను హైదరాబాద్‌లో సిట్ అధికారులు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ ముగిసింది. సరిగ్గా 10 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో పూరీ నుంచి రాబట్టిన అంశాలను కాసేపట్లో ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించనున్నారు. పూరీ నుంచి నార్కోటిక్ నిపుణులు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.