: డ్రగ్స్ కేసులో రేపటి విచారణకు ఛార్మీ కాదు.. శ్యాం కె.నాయుడు!
టాలీవుడ్‌లో అలజడి రేపుతూ హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ వ్యవహారంలో ఈ రోజు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను హైదరాబాద్‌లో సిట్ అధికారులు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, అధికారులు ఈ నెల 20న ఛార్మిని విచారిస్తామని చెప్పారు. కానీ రేపు ఛార్మీని కాకుండా కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని విచారిస్తామని తాజాగా సిట్ అధికారులు తెలిపారు. ముందుగా అధికారులు ప్రకటించిన తేదీల ప్రకారం శ్యాం కె.నాయుడును 23న విచారించాల్సి ఉంది. ఒక్కసారిగా అధికారులు తేదీలను మార్చేసినట్లు తెలుస్తోంది. చార్మీని ఎప్పుడు విచారిస్తారో తెలియాల్సి ఉంది.