: 102 ఐఫోన్లు, 15 టిసోట్‌ బ్రాండ్‌ వాచీలను కడుపుకి చుట్టుకుని.. ప‌ట్టుబ‌డ్డ యువతి


హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ యువతి 102 ఐఫోన్లు, 15 టిసోట్‌ బ్రాండ్‌ వాచీలను చైనాకి అక్రమంగా తరలించాలని ప్లాన్ వేసి వాట‌న్నింటినీ క‌డుపున‌కు చుట్టుకుని వెళుతూ అడ్డంగా దొరికిపోయింది. త‌నిఖీలు చేసే అధికారులు త‌న‌ను గ‌ర్భ‌వ‌తిగా భావిస్తార‌ని ఆ మ‌హిళ అనుకుంది. అయితే, ఆమెను క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన షెంజెన్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అస‌లు విష‌యాన్ని క‌నిపెట్టి అరెస్టు చేశారు. ఐఫోన్లు, వాచీలను ఆమె క‌డుపున‌కు చుట్టుకుని త‌ర‌లించ‌డానికి కడుపు చూట్టూ వైర్లను కట్టుకుని దాని చుట్టూ బెల్ట్‌ పెట్టుకుంది. మెటల్‌ డిటెక్టర్‌తో ఆమెను తనిఖీ చేయగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని అక్క‌డి అధికారులు చెప్పారు.   

  • Loading...

More Telugu News