: పూరీ జగన్నాథ్ ను అరెస్టు చేయడం లేదు: అకున్ సబర్వాల్
డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటలకు పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఈ విచారణ కొనసాగుతుండటంపై ఇప్పటికే టాలీవుడ్ సహా పూరీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీని అరెస్టు చేస్తారేమోననే వదంతులు వ్యాపించాయి.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, పూరీ జగన్నాథ్ ను అరెస్టు చేయడం లేదని చెప్పారు. మరి కొంచెం సేపట్లో విచారణ ముగుస్తుందని పేర్కొన్నారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ పై అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, కెల్విన్ తో ఉన్న సంబంధాలపై పూరీని ఆరా తీసినట్టు సమాచారం.