: ’2.0’లో కేవలం ఒక్కపాట మాత్రమే షూట్ చేయాల్సి ఉంది: అమీ జాక్సన్


శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘2.0’ చిత్రం షూటింగ్ పూర్తయిందని, ఇక ఒక్క పాట మాత్రమే షూట్ చేయాల్సి ఉందని ఈ చిత్రంలో రజనీ సరసన నటిస్తున్న అమీజాక్సన్ చెప్పింది. వచ్చే నెలలో ఈ పాట షూటింగ్ జరగనుందని, రజనీ, తాను 12 రోజుల పాటు ఈ షూటింగ్ లో పాల్గొననున్నట్టు పేర్కొంది. అయితే, ఈ పాట చిత్రీకరణ నిమిత్తం ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇండోర్ లోనే చిత్రీకరిస్తామని, ఇందుకోసం ఓ భారీ సెట్ ను వేయనున్నట్టు చెప్పింది. ఈ పాటలో డ్యాన్స్, రొమాన్స్ ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News