: ‘బాహుబలి 2’ ముందు నా సినిమా ఆడలేకపోయింది: నటుడు ఆయుష్మాన్


బాహుబలి-2 సినిమా విడుదలైన కొద్ది రోజులకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘మేరీ ప్యారీ బిందు’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ సరసన పరిణీతి చోప్రా జంటగా నటించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ‘మేరీ ప్యారీ బిందు’ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆయుష్మాన్ హీరోగా తెరకెక్కనున్న మరో చిత్రం ‘బరైలీ కీ బర్ఫీ’. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.

ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ మాట్లాడుతూ, మేరీ ప్యారీ బిందు సినిమా గురించి ప్రస్తావించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, తన సన్నిహితులు, స్నేహితుల నుంచి స్పందన బాగానే వచ్చింది కానీ, ‘బాహుబలి-2’ ముందు తన సినిమా నిలవలేకపోయిందని అన్నాడు. ‘బాహుబలి-2’ రిలీజ్ అయిన సమయంలో తన సినిమా విడుదల కాకుండా ఉంటే బాగుండేదని, విజయం సాధించేదని ఆయుష్మాన్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News