: నాకు సపోర్ట్ గా ఉన్నందుకు థ్యాంక్స్: రేపు విచారణ ఎదుర్కుంటున్న నేపథ్యంలో ట్వీట్లు చేస్తోన్న ఛార్మీ
టాలీవుడ్‌లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ కేసులో ఈ రోజు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారిస్తోన్న అధికారులు రేపు హీరోయిన్ ఛార్మీని ప్రశ్నించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా ఉన్న తన తండ్రికి, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఛార్మీ ఈ రోజు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తోంది.
తన కూతురు మంచిదని, ఆమెకు డ్రగ్స్ అలవాటు లేదని ఆమె తండ్రి చెప్పిన విషయాన్ని పలు వెబ్‌సైట్‌లు ప్రచురించాయి. ఆయా వార్తలన్నింటినీ ఛార్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. ఆ వార్తలను ప్రచురించిన వెబ్‌సైట్‌లను మెచ్చుకుంటున్నానని పేర్కొంది. కాగా, డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌ను అధికారులు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు.