: పార్లమెంటులో డ్రగ్స్ విషయంపై మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
డ్రగ్స్ కు చరమగీతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ జర్మనీ, యూకే దేశాల నుంచి ఎక్కువగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. హైదరాబాదులో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని విజయసాయి పార్లమెంటులో ప్రస్తావించారు. సినీ నటులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డ్రగ్స్ ను అరికట్టాలని కోరారు.