: స్టంట్ డైరెక్టర్లు ఈ ఫొటో చూసి నాకు పిచ్చేమో అనుకున్నారు: అమితాబ్‌ బచ్చన్


1977లో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం ఖూన్ పసీనా. ఈ చిత్రంలో పెద్దపులితో అమితాబ్ పోరాడే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో పెద్దపులిని గట్టిగా పట్టుకుని అమితాబ్ ఉంటారు. ఖూన్ పసీనా చిత్రం కోసం అసలైన పెద్దపులితో తాను పోరాడుతున్న సన్నివేశంలోని ఆ ఫొటోను ఆమధ్య ఇప్పటి స్టంట్ డైరెక్టర్ల కి చూపించానని, ఈ ఫొటో చూసిన వారు ఆశ్చర్యపోయి, తనకు పిచ్చేమో అని అనుకున్నారని అమితాబ్ పేర్కొన్నారు. కాగా, రాకేష్ కుమార్ దర్శకత్వంలో నాడు తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ తో పాటు వినోద్ ఖన్నా, రేఖ, నిరుపారాయ్, అరుణ్ ఇరానీ, ఖాదిర్ ఖాన్ తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News