: తక్కువ ధరలకే నోకియా కొత్త ఫోన్లు!
ఒకప్పుడు మొబైల్ ఉత్పత్తుల రంగంలో అగ్రస్థానంలో ఉన్న నోకియా, అనంతరం కొత్త బ్రాండుల రంగప్రవేశంతో క్రమంగా వెనకబడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నోకియా హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా ఒక్కొక్క మోడల్ ఫోనును విడుదల చేస్తూ వస్తోంది. ఈ రోజు భారత మార్కెట్‌లో మరో రెండు ఫీచర్ ఫోన్లు విడుదలయ్యాయి. రీడిజైన్ చేసిన నోకియా 105, నోకియా 130 ఫీచర్ ఫోన్ల అమ్మకాలను ప్రారంభించినట్లు సదరు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అన్ని రిటైల్ స్టోర్లలో రెండు వేరియంట్లలో ఫోన్‌లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ. 999 అని తెలిపారు. డ్యుయల్ సిమ్ మోడల్ ధర రూ.1149గా ఉంది. ఓ బ్రాండెడ్ కంపెనీ నుంచి అతి తక్కువ ధరకు లభిస్తోన్న ఫీచర్ ఫోన్ ఇదే.