: పబ్స్ కు, విదేశాలకు వెళ్లడం నాకు హాబీ: సిట్ విచారణలో పూరీ జగన్నాథ్
డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు చేస్తున్న విచారణ కొనసాగుతోంది. పదిహేడేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు వచ్చానని, తనకు సినిమానే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని విచారణలో పూరీ చెప్పినట్టు సమాచారం. పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, తనకు బయటి స్నేహితులు చాలా తక్కువ అని, తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర్ ని చూపెడుతుంటానని విచారణాధికారులతో పూరీ చెప్పినట్టు తెలుస్తోంది.