: మాయావతి రాజీనామా వెనుక అసలు కారణం!
దళితుల సమస్యలపై మాట్లాడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి బయటకు వచ్చేసి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి వెనుక అసలు కారణం వేరే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి పోటీచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కేశవప్రసాద్ మౌర్యను నియమించిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేస్తే ఈ స్థానంలో ఉప ఎన్నికలు రానున్నాయి.
2007లో బీఎస్పీ గెలిచిన అనంతరం మాయావతి మండలి సభ్యురాలిగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2012లో రాజ్యసభకు వచ్చారు. ఇప్పుడు ఆమె లోక్‌సభ మెంబర్‌గా పోటీ చేయాలనుకుంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఆమె పోటీచేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.