: నేను డ్రగ్స్ వాడితే ఇవన్నీ సాధ్యమా?: రానా దగ్గుబాటి
టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు అందాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ రోజు విచారణను కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు హీరో రానా, అతని తమ్ముడి పేర్లు కూడా సిట్ జాబితాలో ఉన్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన కుమారులను అనవసరంగా ఇరికించే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారంటూ రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు కూడా మీడియా ముందు వాపోయారు.
ఈ నేపథ్యంలో, ఇదే విషయంపై ఓ జాతీయ మీడియాతో రానా స్పందించాడు. డ్రగ్స్ లాంటి అలవాట్లు తనకు లేవని స్పష్టం చేశాడు. డైట్, ఫుడ్ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. ఫిట్ గా ఉండేందుకు రోజుకు 20 కిలోమీటర్లు జాగింగ్ చేస్తుంటానని చెప్పాడు. ఒక వేళ తాను డ్రగ్స్ వాడితే... ఇవన్నీ సాధ్యమవుతాయా అని ప్రశ్నించాడు.