: డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన 9 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. వివరాలు వెల్లడి
హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ కేసులో వేగవంతంగా విచారణ జరుపుతున్న అధికారులు ఈ రోజు మరో రాకెట్‌ను ఛేదించిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. ఈ రోజు అరెస్టైన నైజీరియన్లు విద్యార్థి వీసాలపై భారత్‌కు వచ్చి గోవాలో ఉంటున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. పట్టబడిన వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టోఫర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని, అతడు కూడా విద్యార్థి వీసాపైనే వచ్చి గోవాలో ఉంటున్నాడని తెలిపారు. ఈ ముఠాలోని 9 మందినీ అరెస్టు చేశామని చెప్పారు. గోవా కేంద్రంగా ఉంటూ వారంతా హైదరాబాద్ వారికి కూడా ఆన్‌లైన్ లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు.