: ఆవులతో లెజెండ్ ఫెదరర్..అద్భుతం: సెహ్వాగ్
వింబుల్డన్-2017 ఛాంపియన్ రోజర్ ఫెదరర్ పలు సందర్భాల్లో ఆవులతో కలిసి ఉన్న మూడు ఫొటోలను టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. ‘ఆవులపై ప్రేమ చూపుతున్న లెజెండ్ రోజర్ ఫెదరర్. చూడటానికి అద్భుతంగా ఉంది’ అనే క్యాప్షన్ తో మూడు ఫొటోలను పోస్ట్ చేశాడు. ఓ ఫొటోలో ఆవుపాలు పితుకుతూ, మరో ఫొటోలో అలంకరించిన ఆవుతో, ఇంకో ఫొటోలో.. స్విస్ ఓపెన్-2003లో ఆయనకు బహూకరించిన పాడి ఆవుతో ఫెదరర్ ఉన్నాడు.