: శాస్త్రిలు, కుంబ్లేలు వస్తుంటారు, పోతుంటారు: రవిశాస్త్రి
క్రికెట్లో వ్యక్తుల కంటే జట్టే చాలా ముఖ్యమైనదని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రిలు, కుంబ్లేలు వస్తుంటారు, పోతుంటారని... కానీ, జట్టు మాత్రం అలాగే ఉంటుందని చెప్పాడు. శ్రీలంక టూర్ కు వెళ్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గురించి మాట్లాడుతూ, తన కంటే ఎక్కువగా జట్టులోని ఆటగాళ్ల గురించి భరత్ కు తెలుసని... 15 సంవత్సరాలకు పైగా ఆయన ఈ వ్యవస్థలో ఉన్నారని చెప్పాడు. గత శ్రీలంక టూర్ సందర్భంగా తాను పరిణతి చెందానని... ఈ రెండు వారాల్లో మరింత రాటుదేలానని తెలిపాడు. మరోవైపు, శ్రీలంక టూర్ లో ఇండియా 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడబోతోంది.