: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట.. నిషేధం ఎత్తివేసిన ఇండిగో ఎయిర్ లైన్స్!
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఎత్తివేసింది. ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఇండిగోతో పాటు పలు ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి. విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయనను విమానం ఎక్కకుండా అడ్డుకున్నాయి.
ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన ఏకంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలంటూ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచించారు. ఈ నేపథ్యంలో, తనపై నిషేధాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ ఎత్తి వేయడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే ఇతర విమానయాన సంస్థలు కూడా ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది.