: ఆఫీసు అద్దాలు పగలగొట్టిన అల్లరి మేక... వీడియో చూడండి
తన కొమ్ముల శక్తిని, బలాన్ని చూపించాలనుకుందేమో! అద్దాలను గట్టిగా మూడు సార్లు ఢీకొట్టి పగలగొట్టేసిందీ మేక. అమెరికాలోని కొలరెడోలో గల ఆర్గొనిక్స్ కంపెనీ ప్రవేశ ద్వారం అద్దాన్ని కొమ్ములతో గుద్ది అది పగలగానే పారిపోయి, మళ్లీ వచ్చి మిగతా అద్దాలను పగలగొట్టిందీ అల్లరి మేక. ఈ సంగతి తెలియని కంపెనీ వారు దొంగతనం జరిగిందేమోనని భయపడుతూ సీసీ కెమెరా ఫుటేజీలు చూడటం ప్రారంభించారు. తీరా చూసేసరికి ఒక మేకపోతు అద్దాలు పగలగొట్టిందని తెలిసి నవ్వుకున్నారు. వెంటనే ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంటర్నెట్ పుణ్యమాని జంతువులు చేసే అల్లరి పనుల వీడియో రోజుకొకటి బయటపడుతున్నాయి. మీరు కూడా చూడండి మరి!