: కాలేజీలో టీసీ ఇవ‍్వడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థి.. దూకుతానని బెదిరింపు
తన టీసీని తనకు ఇవ్వడానికి కాలేజీ యాజమాన్యం ముప్పుతిప్పలు పెడుతుండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ విద్యార్థి.. వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. తాను ఓ ప్రైవేటు కాలేజీలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నానని, తన టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్) ఇవ్వమని కాలేజీ యాజమాన్యాన్ని కోరితే ఇవ్వడం లేదని అంటున్నాడు. టీసీ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాడు. తన టీసీ ఇవ్వకపోతే పైనుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.