: ఆ నలుగురికి హైకోర్టు నోటీసులివ్వడం మంచి పరిణామం: అంబటి రాంబాబు
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురు నేతలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీకి రాజీనామా చేయకుండానే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో మంత్రులు అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావులకు హైకోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది.