: ఇంట్లో రూ.500 ఇవ్వలేదని కాలువలోకి దూకిన యువకుడు!
చిన్న విషయానికే ఓ యువకుడు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడ శివారులో చోటు చేసుకుంది. తన అవసరార్థం ఆ యువకుడు కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను రూ.500 అడుగుతున్నాడు. అయితే, అతడికి డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈ రోజు మరోసారి డబ్బు అడిగిన ఆ యువకుడికి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆ యువకుడు విజయవాడ శివారులోని బందరు కాలువలోకి దూకాడు. ఈ ఘటనపై స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.