: నోటీసులు అందిన తర్వాత స్పందిస్తా: భూమా అఖిలప్రియ
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనకు హైకోర్టు నోటీసులు ఇంత వరకు అందలేదని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నోటీసులు అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిలప్రియ, ఆ తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను మంత్రి పదవి వరించింది. ఈ నేపథ్యంలో దాఖలైన పార్టీ ఫిరాయింపుల కేసులో మంత్రులు అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.