: మూడు నిమిషాలు దాటితే... టోల్ చెల్లించనక్కర్లేదు!
టోల్ గేట్ల దగ్గర ఎక్కువ సేపు నిరీక్షించాలంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. అలాగే లూథియానాకు చెందిన హరిఓం జిందాల్ కూడా చిరాకు పడ్డాడు. అలాగని ఊరికే వదిలేయకుండా `అసలు టోల్‌గేట్ దగ్గర ఎంతసేపు నిరీక్షించాలి?`, `టోల్ చెల్లింపు ఎంతసేపట్లో పూర్తి కావాలి?` వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ సమాచార హక్కు చట్టం వారికి దరఖాస్తు చేశాడు. ఈ విషయంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సంప్రదించి ఆర్‌టీఐ విభాగం సమాధానమిచ్చింది. టోల్ గేట్ దగ్గర 2 నిమిషాల 50 సెకన్ల కంటే ఎక్కువసేపు నిరీక్షిస్తే టోల్ చెల్లించకుండానే పాస్ ఇవ్వాలనేది వారి జవాబు సారాంశం. 2016 ఆగస్టులోనే అతనికి ఆర్టీఐ సమాధానమిచ్చింది. కానీ టోల్ సంస్థలు ఈ విషయాన్ని బేఖాతరు చేస్తున్నాయని, ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని పేర్కొంటూ తనకు ఆర్టీఐ వారు పంపిన నివేదికను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.