: సిట్ ఆఫీసులో ఉత్సాహంగా కనిపించిన ఆకాశ్... సెల్ఫీలకు అధికారుల క్యూ!
తన తండ్రిని సిట్ అధికారులు విచారిస్తున్న వేళ, యువ నటుడు ఆకాశ్ ను చూసి మాట్లాడేందుకు, అతనితో సెల్ఫీలు దిగేందుకు అబ్కారీ కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. పలువురు ఆకాశ్ ను కలుసుకుని మాట్లాడి, అతనితో సెల్ఫీలు దిగారు. తనను పలకరించేందుకు వచ్చిన వారితో ఆకాశ్ సైతం ఉత్సాహంగా మాట్లాడినట్టు లంచ్ బ్రేక్ లో బయటకు వచ్చిన అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులతో కలసి కొద్దిసేపు బయటకు వచ్చిన ఆకాశ్, వారితో సెల్ఫీలు దిగడం మీడియా కెమెరాల కంటబడింది. ఇక ఆకాశ్, సాయిరాం శంకర్ లోపల కూర్చున్న వేళ, కొందరు ఉద్యోగులు తమ సెల్ ఫోన్లతో తీసిన వీడియోలు కూడా మీడియా చేతికి చిక్కాయి.