: న్యూయార్క్ వెకేషన్ తర్వాత `దత్` షూటింగ్‌లో బిజీ అయిన అనుష్క శర్మ
ప్రియుడు విరాట్‌తో కలిసి న్యూయార్క్‌లో హాలీడే పూర్తి చేసుకున్న అనుష్క, అక్కడే జరుగుతున్న సంజయ్ దత్ బయోపిక్ `దత్` షూటింగ్‌లో బిజీ అయిపోయింది. `న్యూయార్క్‌లో చివరి రెండు రోజులు `మేకప్‌లో బిజీ! దత్` బయోపిక్ షూటింగ్ న్యూయార్క్ లో మరో రెండు రోజులుంది... తర్వాత ముంబై వెళ్లాలి` అంటూ తాను షూటింగ్‌కు సిద్ధమవుతున్న ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. రెండ్రోజుల `దత్` షూటింగ్ తర్వాత షారుక్‌తో కలిసి తాను నటించిన `జబ్ హ్యారీ మెట్ సెజల్` ప్రచార కార్యక్రమాల కోసం అనుష్క ముంబై రానుంది. ఈ సినిమా ఆగస్ట్ 4న విడుదలకానుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో `దత్` సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క పాత్రను సినిమా కోసం మాత్రమే సృష్టించారు. నిజజీవితంలో తన పాత్ర లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాలో సంజయ్‌దత్ తల్లి నర్గీస్ దత్‌గా మనీషా కొయిరాలా, భార్య మాన్యతాగా దియా మీర్జా నటిస్తున్నారు.