: ఇక స్మార్ట్‌ఫోన్లో ఆధార్.... యాప్ విడుదల చేసిన యూఐడీఏఐ
ఆధార్ వివరాలను ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చేయడం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు యాప్ విడుదల చేశారు. `ఎమ్ఆధార్` పేరుతో ఉన్న ఈ యాప్ ద్వారా ఆధార్ నెంబర్, ఫొటో, పుట్టిన తేదీ, చిరునామా వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను త్వరలో ఐఓఎస్ ఫోన్లలో కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. దీని ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఎక్కడైనా ఆధార్ వివరాలు అవసరమైతే మాన్యువల్ ఎంటర్ చేయకుండా, యాప్‌లో కనిపించే క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది.