: పోటెత్తుతున్న గోదావరి.. మరో రెండు రోజులు భారీ వర్షాలు


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 16.4 అడుగులుగా ఉన్న నీటిమట్టం... నిన్న సాయంత్రానికి 17.8 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 23.2 అడుగులకు చేరింది. ఒకవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, మరోవైపు తాలిపేరు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నీటి మట్టం అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News