: ఢిల్లీ కిడ్నాప్ కేసు: నిందితుణ్ని పట్టుకోలేక డబ్బు రెడీ చేసుకున్న పోలీసులు
ఢిల్లీలో తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్న నిందితుణ్ని పట్టుకోలేక, అతను అడిగిన డబ్బులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల్‌కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్‌ను ఓలా క్యాబ్ నడిపే డ్రైవర్ 12 రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. శ్రీకాంత్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారు. కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో కిడ్నాపర్ అడిగిన రూ. 5 కోట్లు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఓలా సంస్థతో కలిసి రూ. 500 నోట్లతో 6 బ్యాగుల నిండా డబ్బు సిద్ధం చేశారు. `6 బ్యాగులు మోసుకెళ్లడం కష్టం రెండు వేల నోట్లలో డబ్బు ఇవ్వండి` అని కిడ్నాపర్ మళ్లీ డిమాండ్ చేయడంతో చేసేది లేక రూ. 2000 నోట్లలో డబ్బు సిద్ధం చేసి, కిడ్నాపర్ కాల్ కోసం నిరీక్షిస్తున్నారు.