: సహాయకుడిగా సచిన్ కావలెను... రవిశాస్త్రి మరో డిమాండ్!


భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా ఎంపికైన తరువాత, మిగతా సహాయకులుగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారిని వద్దని, తనకు నచ్చిన వారికి పదవులు ఇప్పించుకున్న రవిశాస్త్రి, ఇప్పుడు మరో కొత్త కోరికను బయటపెట్టాడు. టీమిండియా విదేశీ పర్యటనలకు బయలుదేరే వేళ, టీముకు కన్సల్టెంట్ గా సచిన్ టెండూల్కర్ కావాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన సెలక్షన్ కమిటీ, బ్యాటింగ్ కోచ్ గా ద్రావిడ్ ను, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను ఎంపిక చేస్తే, వారిని కాదన్న రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ను పట్టుబట్టి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తనకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు సచిన్ ను కోరుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News