: భారత్ పై పాక్ గెలుస్తుందని అస్సలు ఊహించలేదు: హెడెన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై పాకిస్థాన్ గెలుస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ చెప్పాడు. ట్రోఫీని పాక్ కైవసం చేసుకోవడం అంతుచిక్కకుండా ఉందని అన్నాడు. ఐపీఎల్ కి చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపాడు. ఐపీఎల్ కు రెండేళ్ల పాటు ఆ జట్టు దూరంగా ఉండటం తనను ఎంతగానో నిరాశపరిచిందని చెప్పాడు.
టెస్టులు క్రికెట్ కు ఎంతో ముఖ్యమని, ఈ విషయాన్ని ఐసీసీ ఎలా బ్యాలన్స్ చేస్తుందో తనకు అర్థం కావడం లేదని హెడెన్ అన్నాడు. వాస్తవానికి టీ20ల వల్ల టెస్టులకు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెప్పాడు. ఏ ఫార్మాట్ ను అభిమానించే అభిమానులు ఆ ఫార్మాట్ ను ఆదరిస్తారని... ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ ప్రణాళికలు రచించాలని సూచించాడు. ఆధునిక భారత్ ముఖచిత్రం టీమిండియా కెప్టెన్ కోహ్లీ అని హెడెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, స్మిత్ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లని కొనియాడాడు. ఇద్దరిదీ సహజసిద్ధమైన ఆట అని చెప్పాడు. ఇద్దరూ బలమైన నాయకులే అని... అయితే, కెప్టెన్సీలో ఇద్దరికీ కొంచెం తేడా ఉందని తెలిపాడు.