: మోదీ బాటలోనే నేను కూడా అంటున్న కేటీఆర్!
తన కోసం ఎవరూ ఫ్లవర్ బొకేలు, శాలువాలు తీసుకురావద్దని భారత ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లవర్ బొకేలు, హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, యాడ్స్ కోసం నేతలు ఎవరూ డబ్బును ఖర్చు చేయరాదంటూ ఆయన విన్నవించారు. దీని బదులు హరితహారంలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కేటీఆర్ సూచన చాలా స్పూర్తిదాయకంగా ఉందని కొనియాడుతున్నారు. ఈ నెల 24వ తేదీన ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.