: డోక్లాం వివాదం: భారత్, చైనా ప్రత్యక్షంగా చర్చించుకుంటే మంచిదంటున్న అమెరికా
భారత్, చైనా దేశాల మధ్య గత నెల రోజులుగా వివాదాస్పదంగా మారుతున్న సిక్కింలోని డోక్లాం ప్రాంతం విషయంలో ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. ప్రత్యక్షంగా చర్చించుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య అలముకున్న అపోహలు తొలగి, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని సలహా ఇచ్చింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి హీతర్ నారెట్ తమ దేశ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. డోక్లాం ప్రాంతంలో ఇప్పటికే ఇరు దేశాల సైన్యాలు మోహరించి, తమ ప్రభుత్వాల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే!