: సిట్ తో సిట్టింగ్... పూరీ జగన్నాథ్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే!


టాలీవుడ్ డ్రగ్స్ దందాలో పోలీసుల విచారణ ఈ ఉదయం 10.30 గంటలకు మొదలు కానుంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపిన ఎక్సైజ్ శాఖ అధికారులు మొట్టమొదటగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారించనున్నారు. 'డ్రగ్స్ మీరే స్వయంగా కొనుగోలు చేశారా? లేదా ఎవరితోనైనా తెప్పించుకున్నారా?' అన్న ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వాల్సి వుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు. స్వయంగా కొనుగోలు చేస్తే, ఎవరు అందించారు? డబ్బుల బట్వాడా ఎలా? వాటిని ఎవరికి ఇచ్చారు? వంటి ప్రశ్నలు ఉంటాయని, ఎవరితోనైనా తెప్పించుకున్నానని చెబితే, వారిని కూడా పిలిచి విచారిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 100 వరకూ ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్నామని, ఆయన ఇచ్చే జవాబులను బట్టి అనుబంధ ప్రశ్నలు ఉంటాయని, సమాధానాలన్నింటినీ రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News