: వెంకయ్యనాయుడికి బీపీ పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాంలెండి!: నరేంద్ర మోదీ


ఇకపై రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించే వెంకయ్యనాయుడికి రక్తపోటు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటామని తాను హామీ ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిన్న ఆయన నామినేషన్ వేయడానికి ముందు ఎన్డీయే సమావేశం జరుగగా, మోదీ మాట్లాడుతూ, ఈ సరదా వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో రాజకీయ నేతలపై విరుచుపడుతూ, విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించే వెంకయ్య వైఖరిని ప్రస్తావిస్తూ మోదీ ఈ మాటలు అన్నారు.

ఆయన యోగ్యత గల నేతని అభివర్ణిస్తూ, రైతులకు అంకితమైన జీవితాన్ని గడిపిన ఆయన, వ్యవసాయంపై క్యాబినెట్ సమావేశాల్లో ఎన్నో విలువైన సలహాలు, సూచనలను అందించారని అన్నారు. దేశమంతా తిరిగి, వివిధ ప్రాంతాల సమస్యల గురించి తెలుసుకుని, వాటిపై పూర్తి అవగాహనతో మాట్లాడగల సత్తా ఉన్న వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవికి కొత్త అయినా, ఆ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News